Weather Update in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కి.మీ ,పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ , చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు.