Heavy Rains in AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు.