Heavy Rains in AP : బంగాళాఖాతంలో వాయుగుండం తీరంవైపు దూసుకొస్తోంది. ఇది నెల్లూరు-పుదుచ్చేరి మధ్య గురువారం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.