Heavy Rains in Uttarandra District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద ప్రవాహం పోటెత్తటంతో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి.