Rains in AP : నేడు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. విజయనగరం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.