Untimely Rains In Telangana : రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయ్యింది. గాలివాన బీభత్సానికి వరి పైరు నేలకొరిగింది. మామిడి కాయలు పెద్ద సంఖ్యలో నేలరాలాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతికందొచ్చిన పంట నీటిపాలు కావడంతో కర్షకులు ఆవేదన చెందుతున్నారు.