కుండపోత వర్షాలకు వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించగా...జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద తాకిడికి ఎక్కడికక్కడ రోడ్లు ధ్వంసమయ్యాయి. కుంటలు, చెరువుల్లోకి పరిమితికి మించి నీరు చేరడం వల్ల మత్తడి దూకుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన జనం వాటి పేరు వింటేనే జంకుతున్నారు. ఏకధాటి వానలకు ములుగు, యాదాద్రి జిల్లాల్లో వరదల ధాటికి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.