అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.