Vijayawada Gradually Recovering From Flood Water : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలు క్రమంగా తేరుకుంటున్నాయి. వరద ఉద్ధృతి తగ్గిన కాలనీల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. బాధిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ఇంటింటి సర్వే చేసి, మందులను అందచేస్తోంది.