Vijayawada Floods : బుడమేరు వరద ఉద్ధృతికి జలదిగ్భందంలో చిక్కుకున్న విజయవాడలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద ముంపులో కొనసాగుతున్న బాధితులు తమ నివాసాలను వదిలి బయటకు వస్తున్నారు. నీళ్లు తగ్గిన చోట్ల తిరిగి ప్రజలు తమ ఆవాసాలకు చేరుకుంటున్నారు. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, ఇతర చెత్తాచెదారాలను తొలగించేందుకు అగ్నిమాపకశాఖ రంగంలోకి దిగింది. నీటిలో లేని కాలనీలు, నివాస ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.