Normal Conditions In Vijayawada : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి వస్తోంది. ఇళ్లు, దుకాణాల్లో వరద వీడింది. కండ్రిక, అంబాపురం, జక్కంపూడి ప్రాంతాల్లో ఫైరింజన్లు వెళ్లే దారి లేకపోయిన చోట అక్కడక్కడా మురుగు నీరు ఉంది. ప్రభుత్వ సహాయ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు పరిహారం కూడా తగినంత ఇస్తే నష్టాల నుంచి గట్టెక్కుతామని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.