Heavy Flood Water in Musi River : హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి. రాగల రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జలమండలి అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఒక అడుగు మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. మూసీలోకి వరద నీరు పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం చేశాయి.