Hyderabad Rains : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు పలకరించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైన వర్షం క్రమంగా నగరం అంతటా విస్తరించింది. వర్షానికి ఈదురుగాలులు తోడవటంతో అక్కడక్కడా చెట్లు కూలతున్నాయి. సికింద్రాబాద్ మొండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా ప్రహారి గోడ కూలి ఒకరికి గాయాలయ్యాయి.