Heavy Rains In Hyderabad : బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. హైదరాబాద్లోని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు.