రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. సోమవారం ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరదనీటితో మునిగింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ రోడ్లుపై ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంతో చిక్కుకున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించి చెరువులను తలపించాయి.