Heavy Rains in Telangana : రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో నేడూ భారీవర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రహదారులు ధ్వంసం కావడంతో 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకి గండి పడగా మరో 67 దెబ్బతిన్నట్లు వివరించింది. వివిధ జిల్లాల్లో 32 కాల్వలకి గండిపడగా మరో 23 చోట్ల ప్రాజెక్టులు, కాల్వలు దెబ్బతిన్నాయని పేర్కంది. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.