Heavy Rains are Falling in Prakasam District : అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీంతో ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కుండపోత వర్షాలో నెమలిగుండం రంగనాయకస్వామి ఆలయానికి వెళ్లిన 25 భక్తులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చాలా రోజుల తర్వాత వర్షాలు రావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.