Massive Rainfall In Hyderabad : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురిశాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం వర్షాలకు తడిసిముద్దవుతోంది. భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మల్లారెడ్డి హాస్టల్స్‌లోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.