Vijayawada Gradually Recovering From Flood Water : వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద నీటి నుంచి కాలనీలు క్రమంగా బయటపడుతున్నాయి. వరద తీసేసిన కాలనీల్లో పారిశుద్ధ్య పనులు జోరుందుకోగా ఆహారం, కూరగాయలు, నిత్యావసరాల పంపిణీ వేగంగా సాగుతోంది. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు.