CM Revanth Reddy Launches Rajiv Yuva Vikasam Scheme : అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి రూ.4లక్షల వరకు ఆర్థికసాయం అందుతుంది. యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు చేస్తారు.