Neha Reddy Illegal Constructions : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ కంపెనీ విశాఖ జిల్లా భీమిలీ బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్లు మూసుకుంటారా? అని అప్పటి అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి పేర్లను తమకు ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. బాధ్యులైన జీవీఎంసీ, రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది.