Former CM Jagan OSD Krishna Mohan Reddy Frauds : వైఎస్సార్సీపీ హయాంలో షాడో సీఎం ధనుంజయరెడ్డి అయితే తర్వాత స్థానం పి.కృష్ణమోహన్‌రెడ్డిదే. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి ప్రాధికార సంస్థ-పాడాకు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి అప్పటి నుంచి వైఎస్ కుటుంబ వ్యక్తిగా మారిపోయారు. తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి జగన్ ఓఎస్‌డీగా చేరారు. కుమారుడి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపులు సొమ్ము కాజేశారు.