BRS Leader Harish Rao Fires on Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుంటోందని, రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం అవుతోందని, నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే, కాంగ్రెస్ నీళ్లు నములుతోందని ఎద్దేవా చేశారు.