Dhanunjaya Reddy Frauds in Jagan Government : జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ ధనుంజయరెడ్డే డిఫాక్టో సీఎం! ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం! యావత్ ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడిచేది! సాధారణంగా ఎవరికీ కేటాయించని శాఖలన్నీ సీఎం చూస్తుంటారు. కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు, అన్ని శాఖలపై ధనుంజయరెడ్డి అజమాయిషీ కొనసాగింది. జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సీఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా ఆయన ముందు క్యూ కట్టాల్సిందే! ఆయన కరుణాకటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడాల్సిందే! జగన్కు అంతరాత్మలా వ్యవహరిస్తూ, కనీవినీ ఎరుగని రీతిలో అధికారం వెలగబెట్టారు.