Garimella Balakrishna Passes Away : వినరో భాగ్యము విష్ణుకథ- వెనుబలమిదివో విష్ణుకథ, జగడపు చనువుల జాజర- సగినల మంచపు జాజర, పిటికిట తలంబ్రాల పెండ్లికూతురు అంటూ పండిత పామరులనే కాదు ఏకంగా ఆ దేవదేవుడ్ని సైతం మైమరపించిన ఆ స్వరం మూగబోయింది. వేయికి పైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్ని శ్రీవారికే అంకితం చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఇప్పుడు శాశ్వతంగా మహా విష్ణువు చెంతకే చేరారు.