ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా సమరం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. తనను కోసినా సరే వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తీవ్ర ఆవేదనతో మాట్లాడారు.