Howrah Express Insident in Gudur : తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ పరిధిలో హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టా విరిగింది. సునీల్ అనే వ్యక్తి రైలు పట్టాలు విరిగి ఉండటం గమనించి వెంటనే స్పందించాడు. ఎరుపు వస్త్రాన్ని చూపుతూ ఆ మార్గంలో వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్‌ను అప్రమత్తం చేశాడు. లోకో పైలట్ వెంటనే రైలును ఆపివేశాడు. హౌరా ఎక్స్‌ప్రెస్ ఆగిపోవడంతో రైలు నుంచి ప్రయాణికులు కిందకు దిగారు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో సుమారు గంట పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విరిగిన రైలు పట్టాను రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. ఆ తర్వాత హౌరా ఎక్స్‌ప్రెస్ ముందుకు కదిలింది.