Passenger Train Accident in BBNagar : యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు బీబీనగర్ వద్ద ఆగింది. పైలెట్ బోగి వెనుక బోగి కింది భాగంలో మంటలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు పైలెట్, రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో రైలును గంటసేపు బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. పలువురు ప్రయాణికులు వేరువేరు మార్గాల్లో హైదరాబాద్కు బయలుదేరారు. పరిస్థితి అదుపులోకి వచ్చాక రైలు తిరిగి ప్రారంభమైంది.