Suddenly Car Catches Fire on Narketpally Addanki Highway : నల్గొండ జిల్లా యల్లారెడ్డిగూడెం శివారులో నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం గమనించిన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. వెంటనే కారులోని ప్రయణికులు కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.