కర్నులులో ఓమ్ని కారు అగ్నిప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం కలగలేదు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు తగిన చర్యలు తీసుకున్నారు .
నంద్యాల చెక్ పోస్టు నుంచి కర్నూలు నగరం వైపు వస్తున్న ఓమ్ని కారు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కారులో నుంచి కిందకి దిగడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలు కాకుండా ముందు చూపుతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. మంటలకు కారణం షార్ట్ సర్య్కూటని స్థానికులు అంటున్నారు. రోడ్డు పై వెలుతున్న వారు ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. మంటల కారణంగా చుట్టుపక్కల అంతటా పొగ వ్యాపించింది.