School Headmaster Write Letter To Parents in Anantapur District : నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. పిల్లల మానసిక ఎదుగుదల, విద్యా నైపుణ్యాలు, సమాజం పట్ల ఎరుక ఇలాంటి వన్నీ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటాయి. మొక్కై వంగనిది మానై వంగునా? అనే నానుడిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల తప్పక పాటిస్తారు. కానీ ప్రస్తుతం సమాజంలో పిల్లలు తప్పు చేస్తే తిట్టాలేని, కొట్టాలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. కళ్లముందే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేని కొందరు ఉపాధ్యాయులు మాత్రం భిన్న పద్దతుల్లో పిల్లలను దారికి తేస్తున్నారు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పిల్లల అల్లరిని భరించలేని పాఠశాల హెడ్ మాస్టర్ వారిని దారిలో పెట్టేందుకు ఏకంగా వారి తల్లిదండ్రులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిలో మాధ్యామాల్లో వైరల్గా మారింది.