Lack Of Facilities In Govt School : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం రూ.కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ బడిలో సరైన తరగతి గదులు కూడా లేకపోవడంతో విద్యార్థులు పరదాల కిందే కూర్చొని పాఠాలు వినాల్సిన దయనీయ స్థితి నెలకొంది. చినుకుపడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిన దుస్థితిలో ఆ ప్రభుత్వ బడి ఉంది.