Govt Teacher Collect Ancient Coins in Anantapur : ఆయన తెలుగు బోధించే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయితేనేం చరిత్రను భావితరాలకు అందించాలనే తపన మెండుగా ఉంది. దివ్యాంగుడైనప్పటికీ చిన్నతనం నుంచే పురాతన నాణేలు, కరెన్సీని సేకరించేవారు. అది క్రమేపి అభిరుచిగా మారడంతో 247 దేశాల పురాతన నాణేలు, కరెన్సీ సేకరించారు.