Gudlavalleru Engineering College Issue: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఎస్ఆర్జీఈసీ కళాశాలలోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలున్నట్లు జరిగిన ప్రచారంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తేల్చే వరకు వసతి గృహంలోకి వెళ్లలేమని కళాశాల ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. ఘటనపై విచారణకు గుడివాడ సీసీఎస్ సీఐ నేతృత్వంలో కమిటీ వేశారు. హాస్టళ్లలో తనిఖీలు చేసిన విచారణ కమిటీ విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.