Central University in AnantaPuram: అనంతపురం జిల్లాలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ యూనివర్శిటీ తరగతుల నర్వహణకు సిద్ధమైంది. 2 వేల మందికి సరిపడా వసతి గృహాలు, 1200 మంది బోధనకు వీలున్న తరగతి గదులు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. 2014లో సీఎం చంద్రబాబు యూనివర్శిటీకి పునాదులు వేశారని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చినట్లు శింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రీ తెలిపారు.