AP Central University Students Block Vice Chancellor Car : అనంతపురం జిల్లా జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వైస్‌ఛాన్స్‌లర్ కారును విద్యార్థులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ గతరాత్రి వైస్‌ఛాన్స్‌లర్ కారును అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. వారంలోగా సమస్యలు పరిష్కరిస్తామని వైస్‌ఛాన్స్‌లర్ చెప్పినా ఇప్పుడే పరిష్కరించాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు. సమస్యలు తీర్చకుండా ఎలా వెళ్తారని వీసీని ప్రశ్నించారు. రెండో రోజులుగా నిరసనలు చేస్తుంటే విద్యార్థులపై కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కళ్లుకప్పి మరో కారులో వైస్ ఛాన్స్లర్ వెళ్లిపోయారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసనలు చేపడతామని విద్యార్థినీలు స్పష్టం చేశారు.