Jaw Dropping Innovations Done by Prakasam Eng. College Students : ప్రస్తుతం చాలామంది విద్యార్ధులు ఉద్యోగాలు వెతుక్కుకోవడం కన్నా వినూత్న ఆవిష్కరణ లు చేయడం, అంకుర సంస్థలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తరగతుల్లో పాఠాలు వింటూనే అందుకు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు పలు కాలేజీలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఔరా అనిపించే ఆవిష్కరణలు చేశారు. అందులో కొన్ని ప్రాజెక్టులు పేటెంట్స్ దక్కించుకోవడం విశేషం.