NEW SAINIK SCHOOL IN Kethanakonda: విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతోంది. జూన్ నెల నుంచి ఐదు, ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. తాజాగా విజయవాడ సమీపంలోని కేతనకొండలో నాలుగోది ఏర్పాటు కానుంది.