Software From Guntur Writing Ramakoti : సాప్ట్వేర్ ఉద్యోగం అంటే చాలు ఐదెంకల జీతం. విలాసమైన జీవితం వీకెండ్ పార్టీలు, విందులు, వినోదాలు ఇవి మాత్రమే మనకు గుర్తొస్తాయి. కానీ గుంటూరుకు చెందిన యువకుడు మాత్రం అందుకు భిన్నం. ఉద్యోగం చేస్తూనే ఏ మాత్రం విశ్రాంతి దొరికినా రామకోటి రాస్తూ కోదండరాముని సేవలో పునీతమవుతున్నాడు. శ్రీరాముని జీవితం మనకు ఆదర్శం. ఆయన నామాన్ని రాయటం అదృష్టమంటోన్న యువకునిపై యువ ప్రత్యేక కథనం.