College Students Educating Public On Traffic Rules in Vijayawada : సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిలో యువతే అధికంగా ఉంటారు. సామాన్య ప్రజలు సైతం వీళ్లు చేసే విన్యాసాలతో సతమతం అవుతుంటారు. అలాంటిది వాళ్లే ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తే, రూల్స్ పాటించని వారంటూ ఉండరు కదా! సరిగ్గా అలాంటిదే విజయవాడ రద్దీ ప్రాంతాల్లో జరుగుతోంది. కేబీఎన్(KBN) కాలేజీకి చెందిన విద్యార్థులు వాహన చోధకులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. NSS లో భాగంగా ట్రాఫిక్ పోలీసులతో కలిసి విజయవాడ కూడల్లో విధులు నిర్వహిస్తున్నారు.