గతంలో ఎన్నడూ లేని విధంగా...... ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే... రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నామని..... పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో పర్యటించిన మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం ఆరబెట్టుకునేందుకు 50శాతం రాయితీతో రైతులకు టార్పాలిన్లు అందజేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో...... 3వేల 3వందల కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు.... అన్నదాతలకు ఏ విధంగానూ ఉపయోగపడలేదన్నారు.