Tomato Processing Unit in Kurnool District : కర్నూలు జిల్లా రైతులు టమోటాను ఎక్కువగా సాగు చేస్తున్నా తరచుగా ధరలు పడిపోవడం, నష్టాలు మూటకట్టుకోవడం షరా మామాలుగా మారింది. ఎంతో శ్రమించి టమోటాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి అండగా నిలవాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం జిల్లాలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది.