Obulapuram Mining Case: దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఓబుళాపురం గనుల కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. సుమారు పదమూడున్నర సంవత్సరాలు కొనసాగిన ప్రక్రియలో న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారణ జరిపి, 3400కు పైగా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. వాదనలు పూర్తి కావడంతో మే 6న తీర్పు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం తేలనుంది.