Nine Arrested In Old Man Murder Case in Alluri Seetharamaraju District : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగుడ గ్రామంలో ఈనెల 21న చేతబడి నెపంతో వృద్ధుడు అడారి డొంబురు(60) సజీవ దహనం చేసిన ఘటనలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఆదివారం పాడేరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. హుకుంపేట, డుంబ్రిగుడ, అనంతగిరి, వై.రామవరం, మారేడుమిల్లి, చింతూరు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.