Sunitha on Father YS Vivekananda Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగి ఆరేళ్లు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా ఆరో వర్థంతి వేళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థన నిర్వహించారు. సమాధి వద్ద వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.