Dastagiri Enquiry in Kadapa Jail : వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరికి కడప జైల్లో విచారణ ముగిసింది. మూడు గంటల పాటు దస్తగిరిని విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ప్రశ్నించారు. గత ఏడాది కడప జైల్లో దస్తగిరి ఎదుర్కొన్న ఇబ్బందులు, బెదిరింపులు, ప్రలోభాలను విచారణ అధికారికి కూలంకషంగా వివరించి చెప్పారు. అన్ని విషయాలను విచారణ అధికారి ముందు ఉంచానని దస్తగిరి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య కేసును త్వరగా తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వేడుకుంటున్నట్లు దస్తగిరి తెలిపారు.