kushaiguda Murder Case Update : హైదరాబాద్ కుషాయిగూడలో వృద్ధురాలిని హత్య చేసి మృతదేహాన్ని కాళ్లతో తొక్కుతూ వీడియో చిత్రీకరించిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృద్ధురాలిని హత్య చేసింది ఓ మైనర్ బాలుడిగా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి ఇంటి కింది పోర్షన్లో అద్దెకు నిర్వహిస్తున్న హార్డ్వేర్ దుకాణంలో యువకుడు పనిచేస్తున్నట్లు తెలిపారు. దుకాణం యజమానితో పాటు యువకున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.