Pinipe Srikanth in Murder Case : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఎలాంటి విచారణ చేయని పోలీసులు తాజాగా మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో దర్యాప్తు చేపట్టారు. కేసులో మరో నిందితుడైన ధర్మేశ్ను ఇటీవలే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించగా హత్యకు సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి తనయుడు శ్రీకాంత్ పాటు మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.