: మెదక్ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్న శంకరం పేటలో పది రోజులు వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు కూడా ఒకే మాదిరిగా ఉండడంతో గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పద్మనాభస్వామి గుట్ట వద్ద మరో వ్యక్తిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.