Lokesh Mass Warning : చంద్రబాబు అనే ఒక బ్రాండ్‌తో రాష్ట్ర రూపురేఖలనే మారుస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మంచి పని కోసం ఇక్కడికి వచ్చానని ప్రకాశం జిల్లాకు ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారిని రెడ్‌బుక్‌లో పేరు ఎక్కించి పని పడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలం దివాకరపల్లిలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్(సీబీజీ) శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.